వీకెండ్ పార్టీలు మంచి చేస్తున్నాయా? చేటు చేస్తున్నాయా?
వీకెండ్ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చేటు చేస్తున్నాయా? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. యువత మెచ్చే హంగులన్నీ సినిమాలో ఉన్నాయి. కన్నడంలో ఛమక్గా విడుదలై రూ.30 కోట్లు వసూలు చేసింది. తెలుగులో గీతా ఛలో గా విడుదల చేస్తున్నాం అన్నారు నిర్మాతలు. మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్. గణేశ్, రశ్మిక మందన్నా జంటగా నటించిన గీతా ఛలో చిత్రాన్ని మే 3న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే ఉద్దేశంతో ముందుగా చిత్రాన్ని విడుదల చేయాలనుకునప్పటికీ మే 3కి వాయిదా వేశాం అన్నారు.













