శ్రీదేవి బయోపిక్‌లో..అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఉందా : రష్మిక మందన
ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ వరకు బయోపిక్స్ చిత్రాల ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. రాజకీయ, సినీ, క్రీడలకు సంబంధించిన సెలబ్రిటీల జీవిత కథలు సినిమాల రూపంలో తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగా భారతీయ సినిమాల్లో ఐదు దశాబ్దాల కెరీర్‌తో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్‌ను రూపోందించడానికి రంగం సిద్దమవుతోంది. శ్రీదేవి బయోపిక్‌ను రూపొందించడానికి ఆమె భర్త బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రలో నటించేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లేటెస్ట్గా నేను రేసులో ఉన్నానంటూ వరుస సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంటూ యమ క్రేజ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా లైన్లోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. రష్మిక మందన రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ముచ్చటించిన రష్మిక తన మనసులోని మాటను బయట పెడుతూ.. వారికోక ప్రశ్న వేసింది.. శ్రీదేవి బయోపిక్, సౌందర్య బయోపిక్.. వీటిలో నేను ఏది చేస్తే బెటర్? అని తన అభిమానులను అడిగింది. దీంతో రష్మిక అభిమానులంతా శ్రీదేవి బయోపిక్‌లో నటించాలనీ ఆమెను కోరారు. ఈ సమాదానంతో సంతోష పడిన రష్మిక నేను కూడా అదే అనుకున్నానంటూ వారికి బదులిచ్చింది.













