నటుడు రణధీర్ కపూర్‍కు కరోనా పాజిటివ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణధీర్ కపూర్‍కు కరోనా పాజిటివ్ సోకడంతో కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందనక్కరలేదని డాక్టర్ సంతోష్ సెట్టి తెలిపారు. 74 ఏళ్ల రణధీర్ కపూర్ ప్రఖ్యాత నటుడు రాజ్ కపూర్ పెద్ద కొడుకు. ఆయన సోదరులు రిషి కపూర్, రవి కపూర్ గత ఏడాది కాలంలోనే చనిపోయారు.