సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న రమ్యకృష్ణ
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. గత నెలలో ఫస్ట్ డోస్ తీసుకున్న రమ్యకృష్ణ తాజాగా సెకండ్ డోసు తీసుకున్నారు. అలాగే తన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరిని వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలని పేర్కొంది. తన ట్వీట్‌కు.. గెట్ వ్యాక్సినేటెడ్, స్టే సేఫ్ ఎవ్రీవన్, వేర్ మాస్క్, ఫైట్ టుగెదర్, కోవిడ్ వ్యాక్సిన్ తదితర హ్యాష్ ట్యాగులను జత చేశారు. కరోనా సెకండ్ వేవ్ మరింత విజృంభిస్తుండడంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్ తీసుకుని.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఫొటోలను షేర్ చేస్తూ, అందరిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తున్నారు.













