చరణ్ ముంబై వెళ్లడానికి రీజనదేనా?
మునుపెన్నడూ లేనిది రామ్ చరణ్ ఈ మధ్య ముంబైకు తెగ వెళ్తున్నాడు. ఫస్ట్ లో అందరూ దీన్ని ఏదో పర్సన్ ట్రిప్ అనుకుని లైట్ తీసుకున్నారు కానీ చరణ్ అక్కడ ఏకంగా ఒక ఫ్లాట్ తీసుకుని మరీ వెళ్లి అక్కడ మకాం వేయడంతో కొన్ని కొత్త వార్తలు పుట్టుకొచ్చాయి. ఎన్నో సందర్భాల్లో చరణ్ ముంబై కు వెళ్లినప్పటికీ, వాటిలో ఉపాసనతో కలిసి వెళ్లిన వీడియోలనే బయటికొచ్చేలా చాలా జాగ్రత్త పడ్డాడు చరణ్.
అయితే చరణ్ ముంబై రావడానికి కారణం వెనుక ఇదే రీజనంటూ నెట్టింట ఓ వార్త ప్రచారమవుతుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ 4ని షారుఖ్ తో ప్లాన్ చేస్తున్నారని, అందులో మరో హీరోగా చరణ్ ను అనుకుంటున్నారనేదే ఆ వార్త. వాస్తవానికి యష్ రాజ్ ఫిల్మ్స్ ధూమ్ 4ని ప్లాన్ చేయడం నిజమే కానీ అది షారుఖ్, చరణ్ కాంబోలో కాదన్నది ముంబై మీడియా వర్గాలంటున్నాయి.
కానీ చరణ్ ముంబై వెళ్లిన ప్రతీసారీ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో మంతనాలు జరుపుతున్న మాట మాత్రం వాస్తవం. జంజీర్ టైమ్ లో తనను ట్రోల్ చేసిన నార్త్ మీడియాతోనే ప్రశంసలందుకోవాలన్న నేపథ్యంలో చరణ్ బాలీవుడ్ లో ఒక స్ట్రైట్ సినిమా చేయాలని చూస్తున్నాడట. దాని కోసమే చరణ్ పలుసార్లు ముంబై కు వెళ్తున్నాడని తెలుస్తోంది. మరోవైపు చరణ్ తో డిజిటల్ డెబ్యూ చేయించేందుకు నెట్ఫ్లిక్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.













