Unstoppable: బాలయ్యతో చరణ్ అన్‌స్టాపబుల్
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో(Unstoppable) మంచి వ్యూయర్షిప్ తో రన్ అవుతుంది. రీసెంట్ గా ఈ షో కు వెంకటేష్(Venkatesh) తో పాటూ సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) టీమ్ కూడా కలిసి సందడి చేశారు. డాకు మహారాజ్(Daku Maharaj) టీమ్ తో కలిసి ఇవాళే ఒక ఎపిసోడ్ షూట్ పూర్తైంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో రామ్ చరణ్(ram charan) సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
చరణ్(Charan) నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా సంక్రాంతికి రిలీజవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే చరణ్ ఈ షో కు వస్తున్నాడని సమాచారం. గతంలోనే చరణ్ ఈ షోకు రావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు కుదరలేదు. కానీ గతంలో ఓ ఎపిసోడ్ లో చరణ్ తో బాలయ్య(Balayya) మాట్లాడినప్పుడు తప్పకుండా షో కు వస్తానని చరణ్ చెప్పిన మాటను ఇప్పుడు నిర్వర్తిస్తున్నాడని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ తో పాటూ దిల్ రాజు(Dil Raju), శంకర్(Shankar) కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. హీరోయిన్లలో కియారా(Kiara) లేదా అంజలి(Anjali)లో ఒకరు కూడా ఈ ఎపిసోడ్లో కనిపించే ఛాన్సుంది. ఎప్పట్నుంచో మెగా ఫ్యాన్స్ ఈ కలయిక కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అన్నీ కుదిరితే సినిమా రిలీజ్ కు ముందే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ కూడా చేస్తున్నారట.













