రామ్, కియరా మరోసారి జోడీ కట్టబోతున్నారా?
రామ్ చరణ్, కియారా అద్వాని మరోసారి జోడీ కట్టబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వినయ విధేయ రామ లో తొలిసారిగా వీరిద్దరూ జోడీగా నటించారు. ఇప్పుడు మళ్లీ జత కట్టబోతున్నారు. చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ పూర్తిస్థాయి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి గాను కియరాను సంప్రదిస్తున్నారు రామ్చరుణ్. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా ముందుగా సాయి పల్లవిను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో కియరాతో మాట్లాడుతున్నారు. అయితే ఈ చిత్రం ఈమె పాత్ర మాత్రం చిన్నదే. దాన్ని కొన్ని డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది.













