Rakul Preeth Singh: ఏదీ అతిగా చేయొద్దంటున్న రకుల్
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గత కొంతకాలంగా తెలుగులో నటించింది లేదు. రకుల్ రీసెంట్ గా గాయపడిన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న అమ్మడు ఇప్పుడు మళ్లీ తన నెక్ట్స్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. గాయపడిన రకుల్ కొన్నాళ్ల పాటూ విరామం తీసుకుని ఇప్పుడు సెట్స్ లోకి అడుగుపెట్టింది.
ఈ నేపథ్యంలో రకుల్ తన గాయం గురించి, దాని వల్ల ఆమె నేర్చుకున్న విషయాల గురించి రీసెంట్ గా ఓ సందర్భంలో మాట్లాడింది. గాయపడిన తర్వాత తనకు తన బాడీపై గౌరవం పెరిగిందని, అందువల్లే కెరీర్ పై దృష్టి పెట్టగలగడం కూడా నేర్చుకున్నట్టు రకుల్ వెల్లడించింది. అంతేకాదు ఏదీ కూడా అతిగా చేయకూడదని తనకు అర్థమైనట్టు రకుల్ ఈ సందర్భంగా తెలిపింది.
మనం మన శరీరం మాట వినాలని, హద్దుల్ని దాటి మరీ ఓవర్ ఎక్సర్సైజులు చేయొద్దని రకుల్ అందరికీ సూచిస్తుంది. ఇంతకు ముందు తాను ఓవర్ గా వ్యాయామాలు చేసేదాన్నని, కానీ ఇక మీదట ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా పని చేస్తానని రకుల్ తెలిపింది. ఇక కెరీర్ విషయానికొస్తే, రకుల్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ(Mere Husband Ki biwi) ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది.













