ఆర్ ఆర్ ఆర్ లో రకుల్ ప్రీత్ కూడా నటిస్తుందా?
నటిస్తుంది ఐటెం గాల్ గా ఓ పాటలో చేస్తుంది….. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న అసలుసిసలు మల్టీస్టారర్‌గా ఆర్ ఆర్ ఆర్ ని చెప్పుకోవాలి. బ్రిటిష్ వారితో పోరాడిన మన్యం వీరులైన ఆంధ్రాకి చెందిన అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, , తెలంగాణ మన్యం వీరుడు కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లు ఇందులో నటిస్తున్నారు. వాస్తవిక పాత్రలే అయినా ఈ ఇద్దరు మన్యం వీరులు ఒకనాటి కాలం వారు కాదు.. కానీ వారిద్దరు ఒకే కాలంలో కలిసి బ్రిటిష్ వారితో పోరాడితే ఎలా ఉంటుంది? అనే ఫిక్షన్ని జోడించి ఈ మూవీ రూపొందుతోంది. ఇక ఇందులో రామ్‌చరణ్ పోషిస్తోన్న అల్లూరి సీతారామరాజు కి జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ నటిస్తోంది.
ఎన్టీఆర్ కి జోడీగా మన్యం వీరుడైన కొమరం భీమ్‌ని ఇష్టపడే బ్రిటిష్ యువతి పాత్రలో జూనియర్ కి జోడీగా తెల్ల తోలు అమ్మాయి ఒలివియా నటించనుంది. మరోవైపు ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నాడు. అల్లూరి, కొమరంలకి యుద్ద విద్యలను నేర్చించి, వారిలో దేశభక్తిని, బ్రిటిష్ వారిపై పోరాడేందుకు స్ఫూరిని నింపే పాత్ర అజయ్ దేవగణ్ ది అని సమాచారం.
ఇకపోతే ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్న రామ్‌చరణ్‌కి ఓ ఐటం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఐటం పాటలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని సమాచారం. చరణ్ బ్రిటిష్ వారిని ఏమార్చే పోలీస్ అధికారిగా కనిపించే సమయంలో ఈ పాట ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం కంటేముందు రకుల్ రామ్ చరణ్‌తో బ్రూస్లీ, దృవ చిత్రంలలో కలిసి జోడీ కట్టింది. రాజమౌళి చిత్రం అంటే దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ తో ఏ హీరోయిన్ అయినా ఏ పాత్ర ఇచ్చినా సరే అనే పరిస్థితి. ఐటెం గల్ గా అడగ్గానే ఒకే అనేసిందట.
ఆల్రెడీ ప్రస్తుతం తాను బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రాలకు మరింత క్రేజ్ తెచ్చే అవకాశం ఉండటం వల్లనే రకుల్ దీనికి ఓకే చెప్పిందట. బాహుబలిలో కూడా తమన్నా పచ్చబొట్టేసినా, నోరా ఫతేహిలపై పాటలు ఉంటాయి. మరోవైపు ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగణ్ సరసన శ్రియా శరన్ నటిస్తోందని తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే ఈ చిత్రంలో అలియాభట్, ఒలివియా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రియా శరణ్.. ఇలా ఇప్పటికే నలుగురు హీరోయిన్లు చేరారు. మరి రాబోయే కాలంలో వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందా? పెరగ వచ్చు అందులో అనుమానం ఏముంది?













