అలాంటి మగాడినే నా జీవితంలోకి ఆహ్వానిస్తా..
ఎప్పుడూ సరదాగా మాట్లాడే మగాడిని తన జీవితంలోకి ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతోంది పంజాబీ సుందరి రకుల్ ప్రీత్‌సింగ్. వాస్తవంగా అలాంటి మగాళ్లు అరుదుగా ఉంటారని రకుల్ అభిప్రాయపడింది. సరదా లేని వ్యక్తితో ఎన్నెళ్లున్నా వృథానే అని చెప్పుకుంది. రోజులు గడుస్తుంటాయి గానీ బంధాన్ని ఆస్వాదించలేమని అభిప్రాయపడింది. కాబోయే వాడు, సరసాలు అనే విషయాలపై రకుల్ మాట్లాడుతూ.. నాకు సరసాలు తెలియవు. నాకున్న స్నేహితులూ అంతే. ఎవరైనా బయటవాళ్లు మాతో సరసాలు అడితే ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే భయపడుతుంటా. సరదాగా మాట్లాడే వ్యక్తులతో ఎంత సేపు కలిసున్నా సమయం తెలియదు. అలాంటి మగాడినే నా జీవితంలోకి ఆహ్వానిస్తా. నిజానికి అలాంటి భాగస్వామి దొరకడం కష్టమే. సరదా తెలియని వాళ్లతో ఉంటే రోజులు, నెలలు, సంవత్సరాలు దొర్లిపోతాయి తప్ప కలిసుండే బంధంలో సంతోషం ఉండదు. చాలా మంది నాయికలను అడిషన్ చేసి తీసుకుంటూ ఉంటారు. నాకు ఈ ఆడిషన్ అంటే ఇష్టముండదు. నటన అంటే ఎదుటి వ్యక్తి చెప్పేదానికి స్పందించడం, కానీ ఆడిషన్ ఒక గదిలో జరుగుతుంది, అక్కడ ఒక్కరే మనలో మనమే అభినయం చూపించాలి. అలా ఒక వ్యక్తిలోని నట ప్రతిభ ఎలా బయటుకొస్తుంది అని చెప్పింది.













