ప్రియమణికి అరుదైన ఛాన్స్
ఒక్క అనుష్క మినహా రాజమౌళి తన హీరోయిన్స్‌ని రిపీట్ చేసిన దాఖలాలు లేవు. ఆయన హీరోలను మాత్రమే రిపీట్ చేస్తాడు. హీరోయిన్ల విషయంలో ఆయన ప్రతి సినిమాకు కొత్తదనాన్ని కోరుకుంటాడు. ఎన్టీఆర్‌తో మూడు సినిమాలు (స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ), ప్రభాస్‌తో మూడు సినిమాలు (ఛత్రపతి, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్) చేసిన రాజమౌళి తాజాగా ఎన్టీఆర్‌తో నాలుగోసారి, రామ్‌చరణ్‌తో మగధీర అనంతరం రెండోసారి జత కడుతున్నాడు. హీరోయిన్స్‌లో విక్రమార్కుడులో నటించిన అనుష్క, బాహుబలి రెండు భాగాల్లోనూ నటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం రాజమౌళి తాజా చిత్రంలో ప్రియమణి నటించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై ప్రియమణికి రాజమౌళి నుంచి పిలుపొచ్చిందని, ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ప్రియమణి ఓకె చెప్పేసిందని, అయితే అధికారిక ప్రకటన వెలువడేంతవరకు ఈ సంతోషాన్ని తనలోనే దాచుకోవాలని డిసైడ్ అయ్యిందని సమాచారం.













