Raja Saab: రాజా సాబ్ రన్ టైమ్ ఎంతంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్(the Raja saab). మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ షూటింగ్ ఆలస్యమవడం వల్ల పలు వాయిదాల తర్వాత జనవరి 9న రిలీజ్ కాబోతుంది.
హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్(Niddhi Agerwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన కంటెంట్ మూవీపై ఉన్న హైప్ ను ఇంకాస్త పెంచింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది. అంతేకాదు, ఈ సినిమా రన్ టైమ్ మొత్తం 3 గంటల 3 నిమిషాలని తెలుస్తోంది. మూడు గంటల సినిమా అంటే సాధారణంగా చాలా పెద్దదనే చెప్పాలి. మరి అంతసేపు ఆడియన్స్ ను మారుతి ఎంగేజ్ చేయగలడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.






