శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధేశ్యామ్ సందడి
ప్రభాస్, పూజా హేగ్డే జంటగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా హీరో మీరోయిన్ల క్తొత స్టిల్ విడుదల చేశారు. అందులో ప్రభాస్, పూజా హెగ్డే అందంగా కనిపిస్తూ, చేస్తున్న సందడి ఆకట్టుకునేలా ఉంది.
సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు మరోసారి చిత్ర బృందం స్పష్టం చేసింది. ఇటలీ, జార్జియా, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఎప్పటికీ మరిచిపోలేని థియేట్రికల్ అనుభూతిని ప్రేక్షకులకు పంచడం కోసం చాలా కష్టపడ్డామని దర్శకుడు చెబుతున్నారు. 1970 ఇటలీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మలయాళం సహా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు.













