Raashi Khanna: డబ్బింగ్ పనుల్ని మొదలుపెట్టిన రాశీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా రానున్న తాజా సినిమా ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath singh). హరీష్ శంకర్(harish shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా భారీ కలెక్షన్లు అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే రిలీజవాల్సింది.
కానీ షూటింగ్ ఆలస్యమవడం వల్ల సినిమా రిలీజ్ లేటవుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ పెండింగ్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే పనుల్ని వేగవంతం చేసింది.

ఉస్తాద్ భగత్‌సింగ్ లో శ్రీలీల(Sree leela), రాశీ ఖన్నా(Raashi khanna) హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాశీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనుల్ని మొదలుపెట్టినట్టు ఓ పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. చూస్తుంటే మేకర్స్ రిలీజ్ పనుల్ని వేగవంతం చేసినట్టు అర్థమవుతుంది. దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri prasad) సంగీతం అందిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
https://www.instagram.com/p/DUf7P-_EhKC/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
(adsbygoogle = window.adsbygoogle || []).push({});













