బన్నీ ఫ్యాన్స్ కు సరికొత్తగా పుష్ప2 ట్రీట్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప2. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని, పుష్ప1ని తలదన్నేలా తెరకెక్కిస్తున్నాడట సుకుమార్. దానికి తగ్గట్టుగానే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ని సినిమా కోస సుకుమార్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో 1000 కోట్లు కలెక్ట్ చేయాలన్నదే చిత్ర యూనిట్ భావన. దానికి తగ్గట్లుగానే పుష్ప2 నుంచి వచ్చే ప్రతీ అప్డేట్, బజ్ క్రియేట్ చేసేలా, స్పెషల్ గా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాని విధంగా, సరికొత్తగా కాన్సెప్ట్ టీజర్ రెడీ చేసి ఆడియన్స్ కు అందించాలని భావిస్తున్నాడు సుక్కు. ఈ టీజర్ మొత్తానికి బన్నీ క్యారెక్టర్ మీద మాత్రమే కట్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఈ టీజర్ ను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని చూస్తుందట చిత్ర యూనిట్. ఇప్పటికే పుష్ప2 మీద ప్రపంచవ్యాప్తంగా భారీ బజ్ ఉంది. దానికి తగ్గట్లు టీజర్ స్పెషల్ గా ఉంటే మాత్రం ఇక బన్నీ ఆర్మీని ఆపడం ఎవరి వల్లా కాదనే చెప్పాలి.













