అంచనాలను పెంచుతున్న పుష్ప2 సాంగ్
ఈ ఏడాది టాలీవుడ్ నుంచి రానున్న భారీ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 సినిమాకున్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా భారీ హిట్టవడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. పుష్ప2 నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఫస్ట్ లిరికల్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ పాట తాలూకు రెండ్రోజుల కిందట రిలీజైన ప్రోమోకు మొదట నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చాక అందరి అంచనాలు తారుమారయ్యాయి. నకాజ్ అజీజ్, దీపక్ బ్లూ జంటగా ఈ సాంగ్ ను ఆలపించారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించగా పాట మాస్ ఆడియన్స్ కు బాగా కిక్కిచ్చేలా ఉంది.
ఎవరికీ తలవంచకుండా బాస్ లా బతకాలంటే ఎలా ఉండాలో చెప్తూ అమ్మకు, దేవుడికి తప్ప ఎవరికీ తలవంచని పుష్ప నైజాన్ని పదాల రూపంలో చెప్పారు. షూ వేసుకుని మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేసిన స్టెప్పులు వెరైటీగా ఉన్నాయి. మొత్తానికి అంచనాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లడంలో పుష్ప2 ఫస్ట్ సాంగ్ సక్సెస్ అయిందనే చెప్పాలి. పుష్ప2 నుంచి వచ్చిన ఈ పాట చార్ట్ బస్టర్ అవడం ఖాయం.













