దిల్ రాజు లైనప్‌కు ఎవరైనా వావ్ అనాల్సిందే
టాలీవుడ్ లో ఓ మూల చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా తన జర్నీ మొదలుపెట్టిన ఇప్పుడు టాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు దిల్ రాజు. రీసెంట్గా ఆయన ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. సక్సెస్, క్వాలిటీ పరంగా చూస్తే టాలీవుడ్లో నెం.1 ప్రొడ్యూసర్ అంటే దిల్ రాజే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో మెజారిటీ స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేశారు.
ఈ మధ్య హిందీ, తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నారాయన. తెలుగులో కూడా ఆయన సినిమాల స్థాయి పెరుగుతోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూవీస్‌తో పాటూ, కొత్తగా ఆయన ప్లాన్ చేస్తున్న చిత్రాల లిస్ట్ చూస్తే నిర్మాతగా నెక్ట్స్ లెవల్‌కు వెళ్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ లైనప్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్- శంకర్ కలయికలో గేమ్ ఛేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు, ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించనున్నాడు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్న కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరూను తన బ్యానర్లో చేసేందుకు ఒప్పించిన రాజు, సరైన దర్శకుడు, కథ కోసం వెతుకుతున్నాడు. ఇది కాక రజినీకాంత్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించాడు. చరణ్ తో గేమ్ ఛేంజర్ తర్వాత మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడట. ఇలా ఒకదాని వెనుక ఒకటి దిల్ రాజు లిస్ట్ బాగా పెద్దగానే ఉంది.













