అల్లు అరవింద్ కొత్త ప్లాన్స్
అల్లు అరవింద్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ పెద్ద అంచనాలతో ముందుకొచ్చింది. కానీ, వారు అందిస్తున్న రొటీన్ కంటెంట్ వల్ల కాస్త వెనకబడింది ఆహా. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ఆహా కొంచెం సంతృప్తికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అల్లు అరవింద్ మాత్రం అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థల కంటే ఆహా ఎంతో వెనకబడి ఉందన్న విషయాన్ని గ్రహించారు. రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ కంటెంట్‌తోపాటు పెద్ద బడ్జెట్‌తో నిర్మించిన వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం త్వరలోనే మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు అరవింద్. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ ఎత్తేసిన తర్వాతే మెగాస్టార్‌తో అరవింద్ మీటింగ్ ఉంటుంది.













