ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి నిర్మాత ఏ.మహేష్ రెడ్డి రూ. 1 కోటి విరాళం
“ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం వుంది” అన్నారు నిర్మాత, MR ఇండియా లిమిటెడ్, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఏ.మహేష్ రెడ్డి
శిరిడి సాయి, నమో వేంకటేశాయ చిత్రాల నిర్మాత, AMR ఇండియా లిమిటెడ్, ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ A. మహేష్ రెడ్డి కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి సహయనిధి కి 1 కోటి రూపాయలను మంత్రి శ్రీ కె. టి .ఆర్ కి విరాళంగా అందించారు. అదేవిధంగా మే 1న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహయనిధి కి మరో కోటి రూపాయలను చెక్కు రూపంలో సీఎం శ్రీ వైయస్. జగన్ కు అందజేశారు.













