ప్రధాని మోదీని దాటేసిన దేశీ గర్ల్
గ్లోబర్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌లో ప్రియాంకను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే. ఇక హాలీవుడ్లో వెళ్లాక ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్‌కు చేరింది. ఈ సందర్భంగా అభిమానులకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్నెంతగా అభిమానిస్తున్నారో మిమ్మల్ని నేను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని పేర్కొన్నారు. ఫాలోవర్ల సంఖ్య విషయంలో దేశీ గర్ల్ ప్రధాని నరేంద్ర మోదీనే దాటేశారు. మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 13.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్‌కు 9.5 మిలియన్, షారుక్ ఖాన్‌కు 13.3 మిలియన్, సల్మాన్ ఖాన్‌కు 17.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.













