సల్మాన్ ను కలిసిన ప్రీతీ జింతా
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆయన్ను కలవడానికి బాలీవుడ్ నటి ప్రీతీ జింతా జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా తీసిన ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సల్మాన్‌కు మద్దతుగా నెటిజన్లు సోషల్‌మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. ఎంతో మంది వందల కొద్ది వన్య ప్రాణులను చంపుతున్నారని కామెంట్లు చేస్తున్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా సల్మాన్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు.













