అజిత్ తో నీల్ రెండు సినిమాలా?
కేజీఎఫ్, సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తమిళ స్టార్ హీరో అజిత్ తో రెండు సినిమాలు చేయబోతున్నాడనే వార్త ఉన్నట్టుండి సోషల్ మీడియాలో హైలైట్ అయింది. అయితే ఇది కోలీవుడ్ వర్గాల నుంచి వచ్చిన వార్తే తప్పించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పటికే అజిత్ కు రెండు కథలు చెప్పాడని, సినిమాటిక్ యూనివర్స్ లో ఒకటి, వేరే కథతో ఒక సినిమా చేయడానికి డీల్ కుదిరిందని అంటున్నారు.
ఇక రియాలిటీకి వచ్చి చూస్తే ప్రశాంత్ నీల్ కు ఇప్పటికే చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి. సలార్2 స్క్రిప్ట్ ఇప్పటికే రెడీ అయింది. అదెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియదు. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమాకు నీల్ కమిట్ అయ్యాడు. కేజీఎఫ్3 ఉంటుందని యష్, నిర్మాత విజయ్ ఇప్పటికే చాలా సార్లు చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతూ ఉంటుంది.
ఇవి కాకుండా రామ్ చరణ్ తో ఓ సినిమా అంటున్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్ లో అజిత్ తో ఏకంగా రెండు సినిమాలు ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరి ఈ వార్తలు కేవలం రూమర్లా లేక ప్రశాంత్ నీల్ అజిత్ తో ఏమైనా స్టోరీ డిస్కషన్స్ చేశాడా అన్నది అతి త్వరలోనే తెలిసే ఛాన్సుంది. ప్రభాస్, ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల నీల్ ఈ లోపు వేరే సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడేమో కొన్నాళ్లు ఆగితే కానీ క్లారిటీ రాదు.













