Pradeep Ranganathan: నిర్మాతగా మారనున్న కోలీవుడ్ హీరో
తమిళ సినీ పరిశ్రమలో హీరోగా, దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాధన్(pradeep ranganathan) ఇప్పుడు మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే తన ప్రత్యేక కథనం, యూత్‌కు దగ్గరైన ప్రెజెంటేషన్‌తో మంచి క్రేజ్ సంపాదించిన ఆయన, తాజాగా నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నారు. ప్రదీప్ సొంతంగా ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. కేవలం కమర్షియల్ ఫార్ములాలకు పరిమితం కాకుండా, కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ బ్యానర్‌ను ప్రారంభిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త నిర్మాణ సంస్థలో మొదటి ప్రాజెక్ట్‌గా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించనున్నారు. లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో టాలెంటెడ్ నటి మమిత బైజు(mamitha byju) నటించనుంది. రీసెంట్ గా తన యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితకు ఇది మరో కీలక అవకాశం కావొచ్చని భావిస్తున్నారు. కథకు ప్రాధాన్యం ఉండే విధంగా, మహిళా పాత్రను బలంగా చూపించే స్క్రిప్ట్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభ దశలో ఉన్నాయని సమాచారం.
కాగా, ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా మారడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. యువ దర్శకనిర్మాతల తరహాలో కొత్త కథలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ముందుకు వస్తున్న ప్రదీప్, తన బ్యానర్ ద్వారా విభిన్నమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఉమెన్ సెంట్రిక్ మూవీతో నిర్మాణ రంగంలో అడుగుపెడుతుండటం ఆయన దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు దర్శకుడు, ఇతర నటీనటుల వివరాలు వెల్లడయ్యే అవకాశముంది.







