Pradeep Ranganathan: సక్సెస్‌కు ఆ మూడు కీలకమంటున్న తమిళ హీరో
వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు తమిళ యంగ్ టాలెంట్ ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఫస్ట్ మూవీ లవ్ టుడే(Love Today) తో సూపర్ హిట్ అందుకున్న ప్రదీప్, రీసెంట్ గా డ్రాగన్(Dragon) మూవీతో మరో హిట్ అందుకున్నాడు. డ్రాగన్ మూవీ 10 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి ప్రదీప్ ను సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టింది. రీసెంట్ గా ఓ మూవీ ఈవెంట్ లో ప్రదీప్ తన వరుస విజయాలకు గల కారణాన్ని వెల్లడించాడు.
నిజాయితీ కూడిన ఆలోచనలు, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన సినిమాలు కచ్ఛితంగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తాయని, డ్రాగన్ మూవీ అందరికీ నచ్చేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, ఎప్పుడైనా ఎమోషన్స్ ను నిజాయితీగా చూపిస్తే, భాషతో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అవుతారని.. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఈ మూడు డ్రాగన్ ను సూపర్‌హిట్ గా నిలిపాయని ప్రదీప్ వెల్లడించాడు.
రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ప్రదీప్, ప్రస్తుతం విఘ్నేష్ శివన్(Vignesh Sivan) తో కలిసి లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ కోసం రెడీ అవుతున్నారు. సై-ఫై రొమాంటిక్ కామెడీగా రూపొందనున్న ఈ మూవీని రౌడీ పిక్చర్స్(Rowdy Pictures) మరియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్(Seven Screen Studios) జంటగా నిర్మించనున్నాయి. ఈ మూవీలో ప్రదీప్ కు జోడీగా కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటించనుంది.













