ప్రభాస్ అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా మారుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈయన పెళ్లి టాపిక్ కూడా సోషల్ మీడియా లో తప్పనిసరిగా ఓ కాలం ఉంటుంది. ప్రభాస్ పెళ్లి గత పదేళ్లనుండి లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చడం లేదు. ఆవు పులి మేక మాదిరి.. అదిగో పులి అంటే ఇదిగో మేక ఈయన అన్నట్లే ఉంది ప్రభాస్ పెళ్లి వ్యవహారం. ఓ పట్టాన తేల్చడు.. అలాగని అభిమానులు ప్రభాస్‌ను వదలరు. ఎప్పుడు ఎక్కడ దొరికినా కూడా ప్రభాస్ పెళ్లి న్యూస్ర కరకాలుగా ట్రెండింగ్‌లోనే ఉంటుంది. దానికి ఆయన మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి మరో వార్త బయటికి వచ్చింది. మూడేళ్ల కింద అంటే బాహుబలి 2 షూటింగ్ పూర్తి కానివ్వండి అన్నాడు. ఆ తర్వాత అడిగితే అది రిలీజ్ అయ్యాక అన్నాడు.. తర్వాత సాహో అన్నాడు. ఇప్పుడు అది కూడా విడుదలై రెండేళ్లైపోయింది.
ప్రస్తుతం ఈయన రాధాకృష్ణ కుమార్ ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. దానికి తోడు మరో నాలుగు సినిమాలు లైన్లోనే ఉన్నాయి. ఇది పక్కన పెడితే ప్రభాస్ వయసు కూడా 40 దాటిపోయింది. అయినా కూడా పెళ్లి వైపు చూడటం లేదు ఈ హీరో. తాజాగా ఈయన పెళ్లిపై సంచలన వార్తలు బయటికి వస్తున్నాయి. త్వరలోనే ప్రభాస్ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఆ తరువాత ఏమి ఉండదు. కానీ ఈ వార్త లో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ…. తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ అప్డేట్ మాత్రం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అమెరికా లో స్థిరపడిన ఓ వ్యాపార వేత్త (NRI) కూతురుతో ఈ హీరో పెళ్లి జరగనుందనే వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయ్.
ఇప్పటికే ఈయన ఆ అమెరికా అమ్మాయితో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడని…ప్రభాస్ పెళ్లెప్పుడు జరుగుతుందనేది పక్కనబెడితే ఎప్పుడు చేసుకున్నా ఇండియాలో మాత్రం ఈయన పెళ్లి ఉండదని తెలుస్తుంది. ఫారెన్‌లోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అక్కడైతే ఏ గోల ఉండకుండా.. హాయిగా ఉంటుందని ప్రభాస్ ఆలోచన. ఇక్కడ అభిమానులతో పాటు వేలాది మంది వస్తారు. పెళ్లి అక్కడ చేసుకుని ఇండియాలో రిసెప్షన్ ఇవ్వాలనేది ప్రభాస్ అభిప్రాయంగా తెలుస్తుంది..అంతేకాదు… ఇక త్వరలోనే ప్రభాస్ కుటుంబ సభ్యులు ఆయన పెళ్లికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సో…. ఈ వార్త అయినా నిజం కావాలని, త్వరలోనే ఓ ఇంటి వాడవ్వాలని కోరుకుందాం.













