తెలుగు సినిమాకు ఫ్రెంచ్ టైటిల్
హీరో ప్రభాస్ తన కొత్త చిత్రాల కోసం విదేశాల్లో బిజీగా ఉన్నారు. బాహుబలి చిత్రాల తర్వాత సాహోలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం విదేశాల్లోనే జరిగింది. ఇది యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. కాగా సాహో నిర్మాణంలో ఉండగానే ప్రేమకథా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్లాన్ చేశారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పిరియాడిక్ రొమాంటిక్ చిత్రమని ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు అమూర్ అనే టైటిల్ నిర్ణయించినట్టు సమాచారం. అమూర్ అంటే ఫ్రెంచ్లో ప్రేమ అనే అర్థం వస్తుందట. తెలుగు సినిమాకు ఫ్రెంచ్ టైటిల్ నిర్ణయించడానికి కారణాలు ఉన్నాయని తెలిసింది. దీనిపై చిత్ర బృందం వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే అమూర్ అనే టైటిల్ కేవలం ప్రచారంలో మాత్రమే ఉందని, దీనిపై ఇంకా నిర్ణయించుకోలేదని అంటున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.













