డార్లింగ్ బర్త్ డే ట్రీట్.. ఈసారి కాస్త గట్టిగానే!
పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త్ డే వస్తుందంటే ఫ్యాన్స్ కు పండగే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఏదో స్పెషల్ ట్రీట్ ఉంటుందనే ఫ్యాన్స్ ఆశపడతారు. దానికి తోడు ఈ సారి సెట్స్ పై ఏకంగా మూడు సినిమాలుండటంతో ట్రీట్ ముడింతలు ఉంటుందని ఆశ పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఆశించినట్లే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం కూడా ప్రభాస్ తన బర్త్ డే ను విదేశాల్లోనే జరుపుకోవాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. సర్జరీ నిమిత్తం కొన్నాళ్లుగా విదేశాల్లో ఉంటున్న ప్రభాస్, ఒకేసారి బర్త్ డే అయ్యాక ఇండియాకు తిరిగి రావాలని డిసైడ్ అయ్యాడట.
అయితే ప్రభాస్ బర్త్ ను పురస్కరించుకుని ఆయన నటిస్తున్న సినిమా అప్డేట్స్ ఆరోజు వచ్చే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతి మూవీ నుంచి ఫస్ట్ లుక్ ఉంటుందంటున్నారు. సలార్ నుంచి ట్రైలర్ రిలీజ్ చేయలేదు కాబట్టి ట్రైలర్ ను రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక కల్కి నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ రిలీజ్ అయితే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు నిజంగా ట్రిపుల్ ట్రీట్ ఇచ్చినట్లే అవుతుంది.













