Prabhas: మైత్రీతో ప్రభాస్ మరో మూవీ
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas). మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Raja Saab), హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ(Fouji) సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) సినిమాను చేయాల్సి ఉంది. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సందీప్ రెడీ గా ఉన్నాడు.
స్పిరిట్ తర్వాత ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో సలార్2(salaar2) సినిమాను, నాగ్ అశ్విన్(nag ashwin) దర్శకత్వంలో కల్కి2(Kalki2) సినిమాలను చేయాల్సి ఉంది ప్రభాస్. ఈ లోగా హనుమాన్(Hanuman) ఫేమ్ ప్రశాంత్ వర్మ(prasanth Varma)తో ప్రభాస్ సినిమా చేస్తాడని అంటున్నారు. కానీ దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదిలా ఉంటే వీటితో పాటూ ప్రభాస్ ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్(mythri Movie makers) బ్యానర్ లోనే ప్రభాస్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ ఫౌజీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మైత్రీ సంస్థ ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా స్టార్ తో డీల్ కుదుర్చుకుందని, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని సమాచారం.






