వరుణ్ ప్లాన్ ఫలించేట్టే ఉందిగా!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ మూడు రోజుల క్రితం రిలీజై మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోంది.
తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను అందుకుంది. ఇండియాలోని వైమానిక దళంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్, మానుషి జెట్ ఫైటర్స్‌గా కనిపించనున్నారు. టీజర్ మొత్తంలో యుద్ధ విమానాల విన్యాసాలు మెయిన్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
టీజర్ మొత్తం మీద వరుణ్ పవర్ఫుల్ డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. టీజర్‌తో భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమాతో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి 16న రిలీజ్ కానున్న ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మొత్తానికి వరుణ్ బాలీవుడ్ ఎంట్రీ ఫలించేటట్టే ఉంది.













