కొరియా చిత్రాలకు మంచి స్పందన
హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ఆధ్వర్యంలో సారధి స్టూడియో ప్రివ్యూ థియేటర్లో కొరియన్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సారథి స్టూడియోలో పొర్ట్రెయిట్ ఆఫ్ ఎ బ్యూటీ అనే కొరియన్ చిత్రాన్ని ప్రదర్శించారు. జియాన్ యున్ సు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పెయింటర్ ఆఫ్ ద విండ్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ కొరియన్ చిత్రం పలు అవార్డులను దక్కించుకుంది. ఇక ఈ కొరియన్ చిత్రాలకు సినీ ప్రియుల నుంచి మంచి స్పందన లభిస్తోందని హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి ఎస్.ఎస్. ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.













