రెబల్‌స్టార్ అభిమానులకు శుభవార్త
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ బాహుబలి తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చేసిన సాహో సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేస్తున్న కొత్త సినిమా ఆప్డేట్ రానుంది. నిజానికి ప్రభాస్ అభిమానులు ఈ సంక్రాంతికే సర్ప్రైజ్ని ఆశించారు. అయితే ఫిల్మ్‌మేకర్స్ కాస్త ఆచితూచి ఇప్పుడు ఆప్డేట్ని తెలియజేయబోతున్నారు. అయితే ఆ అప్డేట్ ఏమిటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ విడదల చేస్తారని కొందరు.. టైటిల్‌తో పాటు హీరో హీరోయిన్లతో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ అవుతుందని మరికొందరు అంటున్నారు. ఇలా రకరకాల ఉహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తోన్న విషయం విదితమే. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. తొలుత సాహో స్థాయిలోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసినా..ఆ తర్వాత కొన్ని మార్పులు చేసి బడ్జెట్‌ని గణనీయంగా తగ్గించినట్లు తెలిసింది.













