పూజాకు మరో బంపర్ ఆఫర్ ..
టాలీవుడ్లో పూజాహెగ్డే హీరోయిన్గా దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి విడుదలైన అల వైకుంఠపురములో బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో కూడా పూజా నటిస్తోంది. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ చిత్రంలో కూడా అమ్మడే హీరోయిన్ కాగా కోలీవుడ్లో పూజాకు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలిసింది. డైరెక్టర్ హరి తెరకెక్కిస్తున్న అరువా చిత్రంలో సూర్యకు జంటగా పూజాహెగ్డేను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దాదాపు పూజ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించటం ఖాయం అని అంటున్నారు.













