గెస్ట్ రోల్ కు పూజా గ్రీన్ సిగ్నల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తోన్న సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంట్ను సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ రోల్లో కనిపించనుందట. ఇటీవలే గద్దలకొండ గణేష్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే సరిలేరు నీకెవ్వరు మూవీలో ఓ గెస్ట్ రోల్లో నటిస్తుందట. ఇప్పటికే అనీల్ రావిపూడి ఆమెను సంప్రదించాడని.. గెస్ట్ రోల్ కూ పూజా హెగ్డే కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి. మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.













