ప్లే ఫస్ట్ లుక్ విడుదల
అభివన్ సింగ్ రాఘవ్, గజాలా, నైనా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ప్లే. మోక్ష్ దర్శకత్వం వహించడంతోపాటు స్వరాలు సమకూర్చారు. రాజ సులోచన నిర్మాత. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ థ్రిల్లర్ చిత్రమిది. కథ, కథనాలు ఒక ఆటని తలపిస్తాయి. ఆ ఆట ఎలా మొదలైంది? ఆడింది ఎవరు? ఎలాంటి ముగింపు లభించిందన్నది తెరపైనే చూడాలి. సినిమా చూస్తున్నంతసేపూ తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ రేకెత్తుతుంది. ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుందనేది ఇందులో ప్రధానాంశం. నటీనటులు కొత్తవాళ్లైనా చక్కటి పనితీరు కనబరిచారన్నారు.













