పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా సినిమాల పరంపర

అవుననే చెప్పాలి ఎందుకంటె ఏ ఎం రత్నం నిర్మతగా క్రిస్స్ దర్శకత్వం వహిస్తున్న ‘హరి హర వీర మల్లు’ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ మరొక చిత్రం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ రూపొందిస్తున్న స్టైల్ అఫ్ మేకింగ్ కి ఫిదా అయిన కరణ్ జోహార్, ఇప్పుడు ఆయనతో మరో సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సారి పవన్ కళ్యాణ్‌తో చేయబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి’ మూవీ భారీ హిట్ కొట్టింది. ఈ మూవీ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సక్సెస్ ఆయన చూడలేదు. మధ్యలో ‘టెంపర్’ లాంటి సినిమాలు ఉన్నా కూడా, అవేవీ ఆయన స్థాయి సక్సెస్ కావనే చెప్పాలి. మొన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పూరీని మళ్ళీ నిలబెట్టిందని, కావాల్సినంత ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సక్సెస్ మూలంగానే కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ దిగ్గజం పూరితో సినిమాకి సై అన్నాడు. ‘లైగర్’ పేరుతో విజయ్ దేవరకొండతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. లైగర్ సినిమా ఇంకా రిలీజ్ కాకున్నా కూడా, పూరి రూపొందిస్తున్న స్టైల్‌కి ఫిదా అయిన కరణ్, ఇప్పుడు ఆయనతో మరో సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మరో పక్క పూరి ఎప్పటినుండో తీద్దామని ఆశపడుతున్న ‘జనగణమన’ సినిమా, రీసెంట్‌గా పవన్ ఓకే చేసినట్టు సోషల్ మీడియాలో గత వారం నుండి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తే మాత్రం, పవన్ లాంటి భారీ స్టార్‌ని బాలీవుడ్‌కి తీసుకెళ్లిన ఘనత పూరి సొంతం చేసుకున్నట్టే. ఇక అక్కడ హిట్ కూడా కొడితే, పవన్ ఫ్యాన్స్ అందరూ పూరిని నెత్తిన పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. కరణ్ లాంటి దిగ్గజం చేతిలో పవన్ పడితే, ఇక ప్రభాస్ లాగే పవన్ కూడా బాలీవుడ్‌లో పాగా వేయొచ్చు. చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే నిర్మించొచ్చు. అన్నీ కుదిరితే లైగర్ తర్వాత, పవన్‌ని కలిసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించాలని పూరి ఆరాట పడుతున్నాడు. గతం లో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం బద్రి సెన్సేషనల్ హిట్ అయితే ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. మహేష్ బాబు కాదన్న ఈ సబ్జెక్టు తో పవన్ హిట్ కొడతాడా లేదా బోల్తా కొడతాడా అనేది భవిష్యతే చెప్పాలి.