ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కల్యాణ్ గారు క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్ కు వెళ్లారు. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారు. రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు.







