Dragon: డ్రాగన్ ఆ రెండింటినీ మించేలా!
ఎన్టీఆర్(NTR) గుర్తింపు ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సినిమా తర్వాత వచ్చిన దేవర(devara), వార్2(war2) సినిమాలతో తారక్(Tarak) స్థాయితో పాటూ మార్కెట్ కూడా పెరిగింది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(Dragon) అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్నీల్(NTRNeel) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
సలార్(salaar) తర్వాత నీల్(Neel) నుంచి రాబోతున్న మూవీ అవడంతో పాటూ, ఎన్టీఆర్, నీల్ ఇద్దరికీ మాస్ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఈ కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీపై అందరికీ విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఎన్టీఆర్ కూడా ఈ మూవీలో ఎప్పుడూ లేనంత స్లిమ్ గా మారాడు. డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ ను నీల్ నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేస్తాడని ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది.
అంతేకాదు, డ్రాగన్ లో తారక్ కోసం నీల్ ఎన్నో ఎలివేషన్స్ సీన్స్ ను ప్లాన్ చేశాడని, మూవీలోని ప్రతీ ఫ్రేమ్ లో ఎన్టీఆర్ అంచనాలకు మించి కనిపించడంతో పాటూ అతని స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడని అంటున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడైనా స్టార్ట్ అవొచ్చని, డ్రాగన్ మూవీ నీల్ నుంచి గతంలో వచ్చిన కెజిఎఫ్(KGF), సలార్ ను మించేలా ఉంటుందని చెప్తున్నారు.






