NTRNeel: ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ అప్డేట్
ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేవర(Devara) తర్వాత వార్2(war2) సినిమాను చేసిన ఎన్టీఆర్ ఆ సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. ఆగస్ట్ 14న వార్2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న తారక్(tarak), మరోవైపు ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో ఓ క్రేజీ ఫిల్మ్ ను చేస్తున్నాడు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. నీల్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్నీల్(NTRNeel) వర్కింగ్ టైటిట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పోర్షన్ కు సంబంధించి ఇప్పటికే 30 రోజుల షూటింగ్ పూర్తైందని తెలుస్తోంది.
ఆ 30 రోజుల షూటింగ్ లో ఇంట్రో, క్లైమాక్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. ప్రస్తుతం వార్2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తారక్, ఆగస్ట్ 20 తర్వాత ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవనున్నాడట. ఈ మూవీని నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారట. మరి అదెంత వరకు కుదురుతుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్(mythri Movie makers) భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ నెక్ట్స్ ఇయర్ జూన్ లో రిలీజ్ కానుంది.







