NTR: విదేశాలకు బయలుదేరిన ఎన్టీఆర్.. ఎందుకంటే?
ఆర్ఆర్ఆర్(rrr) తర్వాత దేవర(devara)తో తన సత్తా చాటిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(ntr) ప్రస్తుతం ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్నీల్(NTRNeel) వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి డ్రాగన్(Dragon) అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్, నీల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటూ, వారిద్దరికీ మాస్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తుండగా, ఎన్టీఆర్ కూడా ఈ మూవీ కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఈ సినిమా కోసం తారక్ తన కెరీర్లో మునుపెన్నడూ లేనివిధంగా స్టైలిష్ గా తయారయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇప్పుడో అప్డేట్ వినిపిస్తోంది.
డ్రాగన్ లోని కీలక సీన్స్ ను తెరకెక్కించడానికి చిత్ర యూనిట్ జోర్డాన్ కు బయలుదేరుతుందని, అందులో భాగంగానే ఎన్టీఆర్ ఇవాళ ఉదయం ఎయిర్పోర్టులో కనిపించారని తెలుస్తోంది. జోర్డాన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(ntr arts) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తోంది.













