NTR: మరోసారి త్రివిక్రమ్ కోసం మారనున్న తారక్

జూనియర్ ఎన్టీఆర్(jr.ntr) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(prasanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడి మరీ బరువు తగ్గి స్లిమ్ గా తయారయ్యాడు. తన కెరీర్లో మునుపెన్నడూ లేనంత స్టైలిష్ గా నీల్(neel) సినిమా కోసం ఎన్టీఆర్ మారాడు. దీంతో ఈ లుక్ లో ఎన్టీఆర్ ను నెక్ట్స్ లెవెల్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడట నీల్.
సాధారణంగా కాస్త బొద్దుగా కనిపించే తారక్(tarak) నీల్ మూవీ కోసం చాలా కిలోల బరువు తగ్గాడు. ఎన్టీఆర్ ఇంత స్లిమ్ గా మారడం చూసి అందరూ ఎంతో షాకయ్యారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్టీర్ మేకోవర్ అవాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ఈసారి ఎన్టీఆర్ మేకోవర్ కావాల్సింది నీల్ సినిమా కోసం కాదు, నీల్ మూవీ పూర్తయ్యాక తారక్ చేయబోయే త్రివిక్రమ్(trivikram) మూవీ కోసం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరో గా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. హిందూ పురాణాల్లోని ఒక దేవుడైన కుమార స్వామికి సంబంధించిన కథగా ఈ మూవీ రూపొందనున్నట్టు నిర్మాత నాగ వంశీ(naga vamsi) ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీలోని క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ మరోసారి భారీగా మేకోవర్ చేయాల్సి ఉందని అంటున్నారు. గతంలో త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత(aravinda sametha) కోసం భారీ మేకోవర్ చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన తారక్ ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమా కోసం కూడా మేకోవర్ చేస్తున్నాడు. మరి తారక్ ఆడియన్స్ ను ఈ సారి ఏ మేరకు సర్‌ప్రైజ్ చేస్తాడో చూడాలి.