బాలీవుడ్ కోసం ఎన్టీఆర్ నెక్ట్స్ లెవెల్ ప్లానింగ్
ప్రస్తుతం కొరటాల శివతో దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్2 లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటించబోయే పాత్ర ఎలా ఉంటుందని అందరిలోనూ ఆసక్తి పెరుగుతుంది. ఇప్పటికే ఈ క్యారెక్టర్ కు సంబంధించి ఎన్నో రకాల ప్రచారాలు నెట్టింట జరిగాయి.
అయితే ఆ ప్రచారాలేవీ నిజం కాదు. వార్ 2లో యంగ్ టైగర్ ఎంతో బాధ్యత కలిగిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి నెగిటివ్ యాంగిల్స్ లేకుండా ఎన్టీఆర్ క్యారెక్టర్ ను రచయిత ఆదిత్య చోప్రా డిజైన్ చేశాడట. మరి ఈ క్యారెక్టర్ కు, హృతిక్ తో ఎలాంటి బాండింగ్ ఉంటుందనే దాని గురించి మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.
వార్2 షూటింగ్ ఈ వారంలోనే జపాన్ లో మొదలు పెట్టనున్నారు. దేవర షూటింగ్ అయిపోగానే ఎన్టీఆర్ కూడా వార్2 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. అప్పటివరకు హృతిక్ కు సంబంధించిన సోలో సీన్స్ షూట్ చేయనున్నారట. అయితే సీక్రెట్ ఏజెంట్ గా కనిపించే ఎన్టీఆర్, ఇదే క్యారెక్టర్ తో ఓ ఫుల్ మూవీ చేయనున్నాడట. చూస్తుంటే ఎన్టీఆర్ భారీగా ప్లాన్ చేసుకునే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.













