The Girl Friend: గర్ల్ ఫ్రెండ్ కు సక్సెసే కాదు, ప్రాఫిట్స్ కూడా
రష్మిక మందన్నా(rashmika mandanna) హీరోయిన్ గా దీక్షిత్ శెట్టి(deekshith Shetty) హీరోగా రాహుల్ రవీంద్రన్(rahul ravindran) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా ది గర్ల్‌ఫ్రెండ్(the girlfriend). నవంబర్ 7న రిలీజైన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటూ ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కూడా ది గర్ల్‌ఫ్రెండ్ కు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా కొన్ని సెంటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.
ఇప్పటికే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీకి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మార్కెట్లలో రూ.23 కోట్ల గ్రాస్ అందుకోగా, ఓవర్సీస్ లో రూ.7 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ది గర్ల్‌ఫ్రెండ్ కు రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద నేషనల్ క్రష్ సత్తా ఏంటో చూపింది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను అందుకోవడం తో పాటూ ప్రశంసలు కూడా అందుకుంటుంది.
కేవలం ఆడియన్స్ నుంచి మాత్రమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ది గర్ల్‌ఫ్రెండ్ మంచి ప్రశంసలు అందుకుని గొప్ప పేరు తెచ్చుకుంది. సినిమాలో రష్మిక, దీక్షిత్ పెర్ఫార్మెన్స్ ల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. నటీనటుల యాక్టింగ్ తో పాటూ రాహుల్ ఈ కథను తీర్చిదిద్దిన విధానాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. మొత్తానికి గర్ల్‌ఫ్రెండ్ మూవీ కేవలం కలెక్షన్లనే కాకుండా మంచి ప్రశంసలను కూడా అందుకుంది.






