NTRNeel: ఎన్టీఆర్‌నీల్ నెక్ట్స్ జనవరి వరకు నో అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఎన్నో ఆశలు పెట్టుకుని వార్2(war2) సినిమా చేస్తే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవడంతో తారక్(tarak) నిరాశకు గురయ్యాడు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న తారక్ ఇప్పుడు తిరిగి షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్.. కెజిఎఫ్(KGF), సలార్(Salaar) ఫేమ్ ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
డ్రాగన్(dragon) అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. లాస్ట్ వీక్ ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ తిరిగి మొదలుపెట్టారు. అయితే ఈసారి ఎలాంటి అప్డేట్, అనౌన్స్‌మెంట్ లేకుండా మేకర్స్ ఈ షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టినట్టు సమాచారం. అంతేకాదు, నెక్ట్స్ ఇయర్ జనవరి వరకు ఈ సినిమా నుంచి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ను రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.
ఎన్టీఆర్, నీల్ ఇద్దరూ ఈ సినిమాను భారీగా అందరినీ మెప్పించేలా తీయడంపైనే తమ దృష్టిని పెట్టారని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఫ్యాన్స్ ను మెప్పించాలని ఎన్టీఆర్ దానికి తగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారట. వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ కు ఓ మచ్చలా మారడంతో పాటూ ఆ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలొచ్చాయి. అందుకే వార్2 చేసిన గాయలన్నింటినీ తారక్ డ్రాగన్ తో పోగొట్టాలని చూస్తున్నారు.