కంగారు పెడుతున్న అజిత్ తెలుగు మార్కెట్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఒకప్పుడు తెలుగులో కూడా మంచి ఫాలోయింగే ఉండేది. ఆయన సినిమాలు వాలి, ప్రేమలేఖ టాలీవుడ్ లో కూడా కమర్షియల్ గా బాగా వర్కవుట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత అజిత్ తో సినిమాలు తీసిన నిర్మాతలు టాలీవుడ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆయన సినిమాలకు ఆదరణ తగ్గింది. అందుకే తమిళంలో రికార్డ్స్ బ్రేక్ చేసిన విశ్వాసం, వివేకం లాంటి సినిమాలు కూడా తెలుగులో జస్ట్ యావరేజ్ అనిపించుకున్నాయి. వలిమై, తెగింపు సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి.
ఈ ఎఫెక్ట్ ఇప్పుడు అజిత్ కొత్త సినిమా విదాముయార్చి మీద చూపిస్తోంది. విదాముయార్చిని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలని ఈ లోపు బిజినెస్ ను క్లోజ్ చేయాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్లాన్ చేస్తుంది. కానీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి ఆశించిన రేంజ్ లో ఆఫర్లు రాక బిజినెస్ క్లోజ్ చేయలేకపోతున్నారట నిర్మాతలు. లైకా నుంచి వస్తున్న ఇండియన్2 రిజల్ట్ చూశాక అప్పుడు ఈ సినిమా రేటును ఫిక్స్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నట్లు సమాచారం. విదాముయార్చిని అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. కానీ అదే టైమ్ లో సూర్య కంగువ కూడా రిలీజ్ కానుంది. ఇది నిజమైతే మాత్రం అజిత్ ఓపెనింగ్స్ విషయంలో నష్టపోవాల్సి వస్తుంది.













