వార్ 2లో ఎలాంటి క్యామియోలు లేవు
యష్ రాజ్ ఫిల్మ్స్ తీస్తున్న స్పై యూనివర్స్ సినిమాల్లో మొదటిసారి టైగర్3 రూపంలో పెద్ద షాక్ తగిలింది. కలెక్షన్స్ ను చూపించి బ్లాక్ బస్టర్ గా చెప్పుకుంటున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం ఈ సినిమాకు మొదటి రెండు పార్ట్స్ కు వచ్చిన పాజిటివ్ టాక్ అయితే రాలేదు. దీంతో ఈ సినిమా విషయంలో తప్పెక్కడ జరిగిందనే విషయంలో నిర్మాత ఆదిత్య చోప్రా ఆలోచించి, ఇకపై అలాంటి తప్పులకు తావివ్వకూడదని డిసైడయ్యాడట.
పఠాన్ లో టైగర్ ఎపిసోడ్కి థియేటర్లు షేక్ కావడం చూసి, అదేలా టైగర్3లో పఠాన్ ని తీసుకొచ్చారు. ఇది ఆడియన్స్ కు రిపీట్ అనిపించింది తప్పించి, ఎగ్జైట్ అయ్యేలా మాత్రం అనిపించలేదు. దీంతో ఇక క్యామియోల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఎన్టీఆర్- హృతిక్ రోషన్ కాంబోలో రూపొందనున్న వార్2 లో ఎలాంటి గెస్ట్ రోల్స్ పెట్టట్లేదని తెలుస్తోంది.
వీరిద్దరికీ మంచి ఫ్యాన్ బేస్ ఉండటంతో వేరే వారితో గెస్ట్ రోల్స్ చేయించడం ఎందుకని లైట్ తీసుకుంటున్నారని సమాచారం. ఆడియన్స్ ను డైవర్ట్ చేయకుండా ఈ ఇద్దరితోనే సబ్జెక్ట్ ను డీల్ చేయాలని చూస్తున్నారట. ఒకవేళ టైగర్3 హిట్ అయుంటే వార్2 లో కూడా క్యామియో ఉండేదేమో కానీ ఫలితం తేడా కొట్టడంతో కథలో చాలా మార్పులు జరుగుతున్నట్లు సమాచారం.













