ప్రజల ఆరోగ్యం ముఖ్యం పుట్టినరోజు షష్టిపూర్తి వేడుకల్ లెవ్!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు జూన్10 ఈ ఏడాది బర్త్ డే మాత్రమే కాకుండా బాలయ్యకు షష్టిపూర్తి. ఎప్పటిలా సాధారణమైన రోజులైతే…కరోనా సమస్యలు లేకుండా ఉండి ఉంటే నందమూరి అభిమానులు ఈ సంభారాన్ని అంబరాన్ని అంటేలా పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా చేసి ఉండేవారు. అయితే కరోనా బాలయ్య అభిమానుల ఉత్సాహాన్ని నీరు కార్చింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం బాలకృష్ణతో మూవీ చేస్తున్న బోయపాటి #BB3 ఫస్ట్ లుక్ ను బాలయ్య షష్టిపూర్తి సందర్భంగా జూన్ 10న విడుదల చేద్దామని చేస్తున్న ప్రయత్నాలకు బాలయ్య నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికికారణం ప్రస్తుతం జనం అంతా కరోనా పరిస్థితులు వల్ల రకరకాల బాధలతో ఉన్నప్పుడు తన సినిమా ఫస్ట్ లుక్ సంబరాలు ఏమిటి అంటూ బాలయ్య బోయపాటి ఆలోచనలను తిరస్కరించినట్లు టాక్. ముందు తన అభిమానుల ఆరోగ్యం ముఖ్యం ఇలాంటి పుట్టిన రోజులు వస్తూనే ఉంటాయి వేడుకలంవే మనం ఆరోగ్యంగా సంతోషంగా వున్నపుడే చేసుకునేవి, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు గందర గోళ పరిస్థితుల్లో వున్నారని, అందుకనే తాను కూడ తన షష్టిపూర్తి వేడుకలను ఏమి జరుపుకోవడంలేదని కేవలం ఆరోజు తన కుటుంబ సభ్యులతో మాత్రమే కాలం గడుపుతూ తన పుట్టినరోజును చేసుకోబోతున్నట్లు వివరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన షష్టిపూర్తి సందర్భంగా ఎటువంటి హడావిడి చేయవద్దని తన అభిమానులకు ఇప్పటికే తాను సంకేతాలు ఇచ్చానని రోజు రోజుకు కోవిడ్ 19 పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న సమయంలో ఇలాంటి హడావిడి తనకు నచ్చదు అంటూ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ లీకులు బయటకు రావడంతో బాలయ్య పుట్టినరోజునాడు బోయపాటి మూవీ ఫస్ట్ లుక్ ఉండదు అన్న క్లారిటీ వస్తోంది. జూన్ 5న బాలకృష్ణ బర్త్ డే కేవలం డి పి మాత్రం సోషల్ మీడియాలో రిలీజ్ చేసారు.
ఈవిషయాలను తెలుసుకుని బాలయ్య అభిమానులు నిరుత్సాహ పడుతుంటే మరికొందరు మరోవిధంగా కామెంట్స్ చేస్తున్నారు. కరోనా సమస్యతో లాక్ డౌన్ మొదలు అయ్యాక చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అనేక ఫోటోలను షేర్ చేస్తూ మీడియాలో తన హడావిడి కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి ఈ లాక్ డౌన్ పిరియడ్ లో సోషల్ మీడియాలో చిరంజీవి చేసినంత సందడి మరే హీరో చేయలేదు.
అదేవిధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ మేకర్స్ లాక్ డౌన్ ప్రారంభం అయ్యాక చరణ్ పుట్టినరోజునాడు ‘ఆర్ ఆర్ ఆర్’ లోని చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను విడుదలచేసి తెగ హంగామా చేసారు. ఇలా లాక్ డౌన్ కొనసాగుతూ ఉండగానే అనేక సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఆ సినిమాలలోని పాటలు విడుదల చేసి ఆసినిమాలలో నటిస్తున్న హీరోల క్రేజ్ పెంచడానికి ఆ సినిమా దర్శక నిర్మాతలు తమవంతు ప్రయత్నాలు చేసారు. అయితే ఇలా ప్రవర్తించకుండా తన పుట్టినరోజునాడు తన సినిమా ఫస్ట్ లుక్ ను కూడ వద్దని బాలయ్య తన తీరు అందరికంటే చాల విభిన్నం అని తెలియచేస్తున్నాడు అంటూ కొందరు బాలయ్య పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు..













