Thammudu: ఓటీటీలోకి వచ్చేసిన నితిన్ తమ్ముడు
ఈ సినిమాతో ఎలాగైనా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తానని ఎంతో కాన్ఫిడెంట్ గా నితిన్(Nithin) చెప్పిన సినిమా తమ్ముడు(thammudu). గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు నితిన్ క్రేజ్‌ను, మార్కెట్ ను విపరీతంగా దెబ్బ తీశాయి. రాబిన్‌హుడ్(robinhood) కెరీర్ బెస్ట్ హిట్ అవుతుందనుకుంటే అది కూడా అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. దీంతో తమ్ముడుతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని ఎంతో కసిగా వర్క్ చేసిన నితిన్ కు ఆ సినిమా కూడా నిరాశే మిగిల్చింది.
ఓ మై ఫ్రెండ్(Oh my friendu), ఎంసీఏ(MCA), వకీల్ సాబ్(Vakeel Saab) ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్(Venu Sriram) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ(Laya) సినీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. జులై 4న తమ్ముడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ సినిమా అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ డిజాస్టర్ గా నిలిచింది.
అయితే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న తమ్ముడు సినిమా ఇప్పుడు నెల లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తమ్ముడు డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకోగా ఆగస్ట్ 1 నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. హిందీ మినహా అన్ని భాషల్లోనూ తమ్ముడు సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. వర్ష బొల్లమ్మ(vasha bollamma), సప్తమి గౌడ(Saptami gowda) లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్(Ajaneesh lokanath) సంగీతం అందించిన విషయం తెలిసిందే.







