Nithin: హనుమాన్ దీక్షలో నితిన్
నితిన్(nithin) గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. దీంతో తన తాజా చిత్రం రాబిన్హుడ్(robinhood) తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు నితిన్. అందుకే తనకు భీష్మ(Bheeshma( లాంటి సూపర్ హిట్ ను అందించిన వెంకీ కుడముల(Venky Kudumula)తో మరోసారి చేతులు కలిపాడు నితిన్. శ్రీలీల(Sree Leela) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుంది.
ఈ సినిమా కోసం నితిన్ ఎంతో కష్టపడుతున్నాడు. తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రాబిన్హుడ్ ను ప్రమోట్ చేస్తూ సినమిఆకు తెగ ఇంటర్వ్యూలిస్తున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. రాబిన్హుడ్ హిట్ అవాలని తాను హనుమాన్ దీక్ష తీసుకున్నట్టు తెలిపాడు. అయితే గతంలో కూడా నితిన్ పలుమార్లు హనుమాన్ మాల వేసుకున్నాడు.
కానీ ఇప్పుడు నితిన్ మాల ధరించకుండా కేవలం దీక్ష మాత్రమే తీసుకున్నానని, మాల ధరిస్తే బట్టలు కూడా ధరించాలని, ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తాను ఆ బట్టలు వేసుకుంటే అన్నీ ఇంటర్వ్యూలు సేమ్ కాస్ట్యూమ్స్ తో ఉండటం చూసి పాత ఇంటర్వ్యూ అనుకుంటారని, ఈ సారి తాను దీక్ష మాత్రమే తీసుకున్నట్టు చెప్పాడు నితిన్.
అయితే దీక్షకు, మాలకు రూల్స్ అన్నీ సేమే అని, కేవలం దీక్షలో కేవలం బట్టలు మాత్రమే వేసుకోమని నితిన్ తెలిపాడు. తన తాతయ్య ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడిని చెప్పిన నితిన్, ఆయనతో కలిసి చిన్న తనంలో ప్రతీ శనివారం గుడికి వెళ్లేవాడినని, దానికి తోడు తన జయం(Jayam) సినిమాలో హనుమాన్ జెండా ఉంటుందని, ఆ మూవీ బ్లాక్ బస్టర్ అవడంతో అప్పట్నుంచి తాను కూడా ఆంజనేయ స్వామికి భక్తుడిగా మారినట్టు నితిన్ వెల్లడించాడు.













