Swayambhu: నిఖిల్, భరత్ కృష్ణమాచారి, పిక్సెల్ స్టూడియో ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్
పాన్-ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు‘తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. సంయుక్త, నభా నటేష్ హీరోయిన్స్.
పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది.
తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎంతగానో ఎదురుచూస్తున్న స్వయంభు టీజర్ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నిఖిల్ యాక్షన్ లుక్ అదిరిపోయింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మీద భారీ అంచనాలను పెంచింది. స్వయంభు నిఖిల్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా. కార్తికేయ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హ్యుజ్ బజ్ వున్న సినిమా.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇందులో తన పాత్ర కోసం నిఖిల్ పూర్తిగా ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడంతో పాటు ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తోంది. రాజమౌళితో ఐకానిక్ సినిమాలు అందించిన KK సెంథిల్ కుమార్ సినిమాకి డిఓపి గా పనిచేయడం విశేషం. కేజీఎఫ్, సలార్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైనర్స్. స్వయంభు ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కానుంది.













