Swayambhu: స్వయంభు టీజర్ కు డేట్ ఫిక్స్
కార్తికేయ2(karthikeya2) సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(nikhil siddharth). ఆ తర్వాత నిఖిల్ నుంచి పలు సినిమాలొచ్చినప్పటికీ అవేవీ అంచనాలను అందుకోలేకపోయాయి. అయినప్పటికీ నిఖిల్ కు అవకాశాలకు ఏమీ కొదువ లేదు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
నిఖిల్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో స్వయంభు(Swayambhu) ఒకటి. ఈ సినిమాలో సంయుక్త మీనన్(Samyuktha menon), నభా నటేష్(Nabha natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి(Bharath krishnamachari) ఈ స్వయంభును తెరకెక్కిస్తుండగా, భారీ బడ్జెట్ తో ఈ పీరియాడికల్ డ్రామా రూపొందుతుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలుండగా, నిఖిల్ కూడా స్వయంభు కోసం చాలా కష్టపడుతున్నాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 11న స్వయంభు సినిమా టీజర్ రిలీజ్ కానుందని కన్ఫర్మ్ చేస్తూ ఓ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంది. పోస్టర్ లో నిఖిల్ వారియర్ లుక్ లో చాలా కొత్తగా ఎట్రాక్టివ్ గా కనిపిస్తున్నాడు. మరి స్వయంభు టీజర్(Swayambhu teaser) ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.













